బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లా కేంద్రంలోని బి.వై. నగర్‌కు చెందిన నేత కార్మికుడు బూర్ల బలరాం (55) సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఉపాధి లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బలరాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య కి పాల్పడ్డారు. మృతునికి భార్య, ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.