దేశంలో ఏ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవాలన్న బిజెపితోనే సాధ్యం..

0
165

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

-బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

దేశంలో ఏ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవాలన్న బిజెపితోనే సాధ్యం అని,1931 లోనే బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేస్తే, మళ్ళీ ఇప్పుడు బిజేపి ప్రభుత్వం చేపడుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోరెడ్డబోయిన గోపి మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కులగణన చేయలేదని, బిజెపి ప్రభుత్వం మాత్రమే కుల గణన ఇస్తున్నదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కులగణన మీద తీసుకున్న నిర్ణయం సంచలనం అని అన్నారు.కాంగ్రెసె పార్టీ నాయకులు మరియు బిసి సంఘాలు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో చేసిన కులగణనను ఒప్పుకోలేదని,వారి పార్టీ కార్యకర్తలలే ప్రతులను చించి వేసారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిందని, పేద ముస్లింల ప్రయోజనాల కోసం వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసిందని ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తానన్న
కులగణన మా ద్వారానే వచ్చిందటున్న కాంగ్రెస్ నాయకులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చడం లేదు అని, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. రైతుల వద్ద తూకం వేసిన వరి ధాన్యం డబ్బులను, వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, లేని పక్షంలో బిజెపి తరఫున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here