హైదరాబాద్:
తెలంగాణా మాజీ సిఎం కేసీఆర్‌ను ఏపి సిఎం వైస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సిఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ కు సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, మహముద్ అలీ, సిరిసిల్ల నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి ఉన్నారు.
