టెక్ దిగ్గజం యాపిల్ నుంచి ఐఫోన్ 15 సిరీస్ మోడళ్లు ఇటీవల లాంచ్ అయ్యాయి. ఆ తర్వాత కంపెనీ స్కేరీ ఫాస్ట్ పేరుతో నిన్న (అక్టోబర్ 30న) మరో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్‌లో కొత్త ఐమ్యాక్ పీసీలు, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లను యాపిల్ ఆవిష్కరించింది. వీటిని కంపెనీ లేటెస్ట్ M3 చిప్‌సెట్స్‌తో అందిస్తోంది. స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌లో యాపిల్ ఆవిష్కరించిన ఈ అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్ ప్రత్యేకతలు చూద్దాం.
కొత్త ప్రొడక్ట్స్
యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌లో కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను ఆవిష్కరించింది. ఇవి కొత్త ఎం3 సిరీస్ ప్రాసెసర్లతో పనిచేస్తాయి. ఈ కెపాసిటీతో ల్యాప్‌టాప్స్ 22 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించడంతో పాటు మరింత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తాయి. యాపిల్ 24-అంగుళాల ఆల్-ఇన్-వన్ ఐమ్యాక్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది సైతం లేటెస్ట్ M3 చిప్‌సెట్‌తో వస్తుంది.
M3 చిప్‌సెట్
స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌లో లాంచ్ అయిన M3 చిప్‌సెట్, కంపెనీ ఇంటర్నల్ మ్యాక్ ప్రాసెసర్ లైనప్‌లో మూడో తరం ప్రాసెసర్. ఈ అడ్వాన్స్‌డ్ చిప్‌సెట్ డివైజ్‌ల మొత్తం పనితీరును ఇంప్రూవ్ చేస్తుంది. గ్రాఫిక్స్ హార్స్‌పవర్‌కు అప్‌గ్రేడ్స్‌తో M3 చిప్‌ను యాపిల్ విడుదల చేసింది. ఈ కొత్త చిప్ లైనప్, అడ్వాన్స్‌డ్ 3-నానోమీటర్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్‌ను మరింత సమర్థవంతంగా మేనేజ్ చేస్తుందని యాపిల్ తెలిపింది. బేస్ మోడల్ ఎనిమిది మెయిర్ కోర్స్‌తో వస్తుంది. గ్రాఫిక్స్ కోసం 10 కోర్స్ అదనంగా ఉంటాయి. ఇవన్నీ డివైజ్ పర్ఫార్మెన్స్‌ను మరింత ఇంప్రూవ్ చేస్తాయి. 3-నానోమీటర్ టెక్నాలజీతో వచ్చిన ఇటువంటి చిప్స్, బ్యాటరీ లైఫ్‌ను సేవ్ చేస్తూనే పనితీరును పెంచుతాయి.
గతంలో యాపిల్ ఇంటెల్ చిప్స్‌ను సంస్థ యూజ్ చేసింది. కంపెనీ ‘యాపిల్ సిలికాన్’ పేరుతో సెమీకండక్టర్ బిజినెస్‌లోకి 2020లో ఎంటర్ అయింది. అప్పటి నుంచి కంపెనీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్‌లో సొంత ప్రాసెసర్లను వినియోగిస్తోంది. వాటిని నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. సొంత చిప్‌సెట్స్ వినియోగం పెరిగినప్పటి నుంచి యాపిల్ మ్యాక్ కంప్యూటర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. కానీ ఇటీవలి త్రైమాసికాల్లో ఆదాయం మళ్లీ పడిపోయింది. M3 చిప్ లాంచింగ్‌తో కంపెనీ మ్యాస్ బిజినెస్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది.
సిరీస్‌లో మరో రెండు చిప్స్
యాపిల్ M3 సిరీస్‌లో ప్రో, మాక్స్ వెర్షన్లను కూడా పరిచయం చేసింది. కంపెనీ హై పర్ఫార్మెన్స్ డివైజ్‌లలో వీటిని వినియోగించింది. M3 ప్రో చిప్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌లో 12 కోర్స్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం 18 కోర్స్ ఉంటాయి. M3 మ్యాక్స్ ప్రాసెసర్‌లో 16 మెయిన్ కోర్స్, 40 గ్రాఫిక్స్ కోర్స్ ఉంటాయి. 2021 నుంచి ఉన్న M1 చిప్ కంటే ఇది 80% ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ కొత్త ప్రాసెసర్ సిరీస్ లాంచింగ్‌తో మార్కెట్‌లోని ఇంటెల్, ఎన్‌విడియా కార్పొరేషన్, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్ వంటి సంస్థలకు యాపిల్ గట్టి పోటీ ఇవ్వనుంది.