బలగం టీవి…
-‘ప్రజా పాలన’ను పకడ్బందీగా నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎల్లారెడ్డిపేట ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లాలోని అర్హతగల ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకునేలా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ రైతు వేదికలో,
ముస్తాబాద్ మండలం కొండా పూర్ గ్రామంలోని రెడ్డి కమ్యూనిటీ హల్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన అభయహస్తం గ్యారంటీ ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. దరఖాస్తు దారులతో మాట్లాడారు. కౌంటర్ లను పరిశీలించి దరఖాస్తు అర్జీల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు. దరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ డిసెంబర్ 28 న ప్రారంభమైన ప్రజా పాలన కార్యక్రమం ఈ నెల జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
అధికారుల బృందాలు నిర్దేశిత షెడ్యూల్ మేరకు ప్రతి గ్రామ, వార్డులో ప్రజా పాలన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని అర్హులైన అబ్ధిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించడం కోసం ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందున అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు లు స్వీకరించాలని అధికారులకు చెప్పామన్నారు. మహిళలు, వృద్ధులు,వికలాంగుల కోసం ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీ లు కోసం కాకుండా ఇతర సమస్యల పరిష్కారం కోసం వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరించేందుకు జనరల్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తు దారుల సందేహాల నివృత్తి కి , దరఖాస్తు పూరించడం తో సహాయకారిగా ఉండేందుకు హెల్ప్ డెస్క్ కూడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. అధికారులు
సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్రజాపా లన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
క్షేత్ర పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, ఎంపిడివో రమా దేవి తదితరులు పాల్గొన్నారు.
