–కలెక్టర్ అనురాగ్ జయంతి
బలగం టివి,సిరిసిల్ల :
ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 22, డీపీఓకు 4, సిరిసిల్ల మున్సిపల్, హౌసింగ్, ఉపాధి కల్పన కార్యాలయాలకు 2 చొప్పున, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ రూరల్ ఎంపీడీవో కార్యాలయాలకు, ఎక్సైజ్ శాఖకు ఒకటి చొప్పున ,మొత్తం 36 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జెడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, వేములవాడ ఆర్డీఓ మధుసూదన్, ఎస్డీసీ గంగయ్య తదితరులు పాల్గొన్నారు