బలగం టీవి, బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మానువాడ గ్రామానికి చెందిన ఐరెడ్డి రాజ్యలక్ష్మిని మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గా రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత నియమించి, నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఐరెడ్డి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ: నా నియామకానికి సహకరించిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం,తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్,జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వరాల నర్సింగం,మానువాడ సర్పంచ్ రామిడి శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ దుర్గరెడ్డి మరియు మండల కాంగ్రెస్ నాయకులకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.బోయినిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరియు మహిళ కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోయిని ఎల్లేష్, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎండీ బాబు, యువజన కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఉపాధ్యక్షులు నిమ్మ వినోద్ రెడ్డి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వినర్ ఆకుల అజయ్,మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ల్యాగల దేవయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బత్తిని సంపత్, బత్తిని శేఖర్,కర్నె శ్రీకాంత్, కర్నె కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.