బలగం టివి, హైదరాబాద్:
- తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నూతన చైర్మన్ గా నియామాకమైన శ్రీనివాస్ రెడ్డిని టీయుడబ్యుజే రాష్ట్ర నాయకులు విరహాత్ అలీ, నగునూరి శేఖర్, సత్యనారయణ రెడ్డి, నరేందర్ రెడ్డి కలిసి అభిందనలు తెలిపారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం పై ప్రత్యేక చొరవ చూపడం హర్షణీయమని,తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకారంతో జర్నలిస్టుల అన్ని సమస్యలను పరిష్కరించి,జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
