బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- మల్కపేట రిజర్వాయర్, పంప్ హౌస్, కంట్రోల్ రూం తనిఖీ
కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం పరిశీలించారు. మల్కపేట రిజర్వాయర్ లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉంది అని జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి ని ఆరా తీయగా, ఈ రోజు 0.75 టీ ఎం సీ ల డెడ్ స్టోరేజ్ నీరు నిల్వ ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి 0.5 టీఎంసీ నీటి విడుదలకు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్ కు చేరుకోగానే.. దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని అన్నారు.నీటి పారుదల శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటున్నారని తెలిపారు.
కలెక్టర్ వెంట ఈఈ కిషోర్, డీఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

