బలగం టివి ,
రాబోవు మహాశివరాత్రి జాతర మరియు సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకొని నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ (LB’s) శ్రీయుత పి. గౌతమి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిసరాలు మరియు భక్తులకు సంబంధించి చేయదలచిన ఏర్పాట్లు మున్నగు విషయాలపై అధికారులతో చర్చించి ముఖ్యమైన ప్రదేశాలను పర్యవేక్షించారు.
అడిషనల్ కలెక్టర్ తో పాటు ఆర్ డీ ఓ మధుసూధన్ , ఎం ఆర్ ఓ మహేష్ , మున్సిపల్ కమీషనర్ అన్వేష్ , ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి శ్రీమతి జయకుమారి , ఆలయ ఈ ఈ రాజేష్ , డి ఈ ఈ రఘునందన్ , ఏ ఈ రామ్ కిషన్ రావు ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు మరియు ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు
