
-ఎస్పీ అఖిల్ మహాజన్.
బలగం టివి, రాజన్న సిరిసిల్ల :
ఒంటరిగా తిరుగుతున్న మహిళలే లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సిరిసిల్ల రూరల్ పోలీస్ లు అరెస్ట్, చేసి రిమాండ్ కి తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో ఎస్పీ అఖిల్ మహాజన్వివరాలను వెల్లడించారు.

తంగళ్ళపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన రుద్రాపు పోషవ్వ అనారోగ్యం రీత్యా గత వారం రోజుల క్రితం డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిదగ్గర దింపి వస్తామని చెప్పి, ఇంటి వద్ద దింపే క్రమంలో బలవంతంగామెడలోని పుస్తెలతాడును తెంపుకొని పారిపోయినారు. తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ జునైద్ సిబ్బంది తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో శుక్రవారం బద్దెనపల్లి క్రాస్ రోడ్ వెహికల్ చెకింగ్ చేపట్టగా అనుమానస్పదంగా కనిపించిన సిద్ధన యదవ్వ బోదాసు నరేష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశ్యంతో దొంగతనాలు చేయాలని భావించి ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నామని, పోషవ్వ వద్ద పుస్తెలతాడు దొంగలించామని ఒప్పుకోవడంతో రిమాండ్ కి తహరలించడం జరిగిందని తెలిపారు.ఇద్దరు నింధితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్, ఆర్ఎస్ఐ జునైద్,సిబ్బంది నరేందర్, రాజశేఖర్, శ్రీనివాస్, అక్షర్ లను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించి, రివార్డు ల ను అందజేశారు.
