- వ్యవసాయ రుణాలను మరింతగా పెంచాలి
- డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో
కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల 08 ఫిబ్రవరి, 2024:
చిన్న తరహా పరిశ్రమలకు స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలు అందజేసీ ప్రోత్సాహం అందించాలనీ,
వ్యవసాయ రుణాలు పెంచాలని డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బ్యాంకర్ లను ఆదేశించారు.
జిల్లా స్థాయి బ్యాంకర్ లు, అధికారుల సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం నిర్వహించారు.
జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి మల్లి ఖార్జున్ రావు ప్రసుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాలు, సాధింపులు, గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలను కలెక్టర్ కు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి లక్ష్యాల సాధనకు బ్యాంకర్ లు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
జిల్లాలోని బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమకు కేటాయించిన లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు.
తమ విద్యుత్ అవసరాల నిమిత్తం
సోలార్ విద్యుత్ యూనిట్ లను స్థాపనకు ముందుకువచ్చే పవర్ లూమ్ , రైస్ మిల్ లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు , చిన్న తరహా పరిశ్రమలు, హౌసింగ్ యజమానులకు బ్యాంకర్ లు రుణాలు అందజేసి ప్రోత్సాహం అందించాలన్నారు.
జిల్లాలో సూక్ష్మ,, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ఆర్థిక ప్రోత్సాహాన్ని మరింతగా పెంచాలన్నారు.
రుణాలను సకాలంలో చెల్లించిన పట్టణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ క్రింద విరివిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్ లకు చెప్పారు. రుణాలు తీసుకుని నిర్దేశిత సమయంలో చెల్లింపులు చేయని సంఘాలను గుర్తించి రిసోర్స్ పర్సన్ ల సహాయంతో బకాయిలను వసూలు చేయాలన్నారు. పంట రుణాల,పశుసంవర్ధక
అభివృద్ది కి మరింత ఫోకస్ పెట్టీ అర్హులకు లోన్లు ఇవ్వాలని ఆదేశించారు. మహిళా సంఘాలు, అలాగే గ్రామపంచాయతీ ల్లో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ల ఈఎంఐ చెల్లించేలా చూడాలని ఆయా శాఖల అధికారులను వివరించారు.
పీఎంఎఫ్ఎంఈ కింద మంజూరు అయిన
యూనిట్ లను పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయ్యేలా , సక్సెస్ అయ్యేలా చూడాలన్నారు. ఇదే స్కీం కింద
అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేయాలని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి ఎవరైనా లబ్దిదారులు యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇప్పటికీ సమర్పించకుంటే వెంటనే సమర్పించేలా చూడాలనీ సంబంధిత అధికారులు ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన ఆర్థిక సహకారం రైతులకు అందివ్వాలన్నారు.
ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు
ఆర్ బీ ఐ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వ తేదీ దాకా సాధ్యమైనంత ఎక్కువగా ఆర్థిక అక్షరాస్యత క్యాంపులను గ్రామాల్లో నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. విద్యార్థులకు కూడా బ్యాంక్ సేవలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
సైబర్ నేరగాళ్ల చేసే నేరాలు, తీసుకోవలసిన అప్రమత్తత చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ కు వచ్చే
భక్తులకు బ్యాంకింగ్ సేవలపై అవ గాహన కల్పించాలని, వీలైతే అకౌంట్ ఓపెనింగ్, ఇతర సేవలు అందించాలని కోరారు. నాబార్డ్ అందించే వివిధ రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులు దీని పై వివరించాలన్నారు.

బ్యాంకులు మరింతగా ప్రజలకు చేరు అయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని బ్యాంకర్ లకు సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ , బ్యాంకర్ లు, అధికారులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ -2024-25 ను ఆవిష్కరించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ఎల్ డీఎం మల్లికార్జున్ రావు, ఆర్బీఐ ఎల్డీఓ సాయితేజా రెడ్డి, నాబార్డ్ డీడీఎం జయప్రకాష్, యూబీఐ చీఫ్ మేనేజర్ ప్రేమ్ కుమార్, ఎస్ సీ కార్పొరేషన్ ఈడీ వినోద్, డీపీఓ రవీందర్, డీఏఓ భాస్కర్, డీఎఫ్ఓ శివప్రసాద్, డీఆర్డీఓ శ్రీనివాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ తదితరులు పాల్గొన్నారు.