బలగం టివి,సిరిసిల్ల:
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి. పథకం తో తీవ్రంగా తీవ్రంగా నష్టపోతున్నామని అటో డైవర్లు ను అదుకోవాలనీ, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ ను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 16న ఆటో డ్రైవర్లతో పాటుగా క్యాబ్, డీసీఎం, లారీల డ్రైవర్లు బంద్ పాటించనున్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించడం తో తాము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టాలని ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంలో రేపు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ఆటో డ్రైవర్ల బంద్‌పై ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది.