- అంబేద్కర్ సంఘాల హెచ్చరిక.
- గద్దర్ అవార్డులపై మంచి ఆలోచన.
బలగంటివి, , ముస్తాబాద్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది అవార్డుల మాదిరి గద్దర్ అవార్డులు కూడా ఇవ్వాలని ఒక సభలో పేర్కొన్నారు.ఇది జీర్ణించుకోలేని కొంతమంది పని కట్టుకొని సోషల్ మీడియాలో గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అంబేద్కర్ సంఘాల నాయకులు మండిపడ్డారు.ప్రజాయుద్ధనౌక గాయకుడు,మాటల తూటా విప్లవకారుడు గద్దర్,తాను ప్రసిద్ధ భారతీయ జానపద గాయకుడు, కవి సినీ గేయ రచయిత, సామాజిక కార్యకర్త సామాజిక సమస్యలపై తన గళంతో బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించిన ధైర్యశాలి అతనొక విప్లవ ఆయుధమని పేర్కొన్నారు.అట్టడుగున ఉన్నవారి హక్కుల కోసం ఆట పాటలతో తన సమయాన్ని,జీవితాన్ని పీడిత ప్రజల కొరకే అంకితం చేశారని వెల్లడించారు.సామాజిక,ఆర్థిక రాజకీయ సమస్యలపై అవగాహన పెంచడానికి అసమానతలు లేని సమాజం కోసమే తాపత్రాయపడ్డారని తెలిపారు.మహనీయులకు ఎప్పుడు కూడా కుల మతాలను అంటగట్ట వద్దని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల బ్రతుకులు రాజ్యాంగ పలాలతో విప్లవోద్యమం ద్వారా మాత్రమే మారాయని వెల్లడించారు.తన మాట,అటపాటలతో దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారని తెలియజేశారు.గద్దర్ పేరుపై అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పుట్టిన రోజున ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఆంటీ టెర్రరిజం ఫోరం సభ్యుడు శ్రీధర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేస్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా కొంతమంది మండల కేంద్రంలో కుల మతాలను రెచ్చగొడుతూ ప్రజల్లో తప్పుడు ఆలోచనలను నింపడం మానుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గూడూరు మాజీ సర్పంచ్ చాకలి రమేష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్,జంగ భూమరాజు,పిట్ల చంద్రం, చందు,కిషన్ తదితరులు పాల్గొన్నారు.