ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు.

0
43

బలగం టీవీ, తంగళ్ళపల్లి:

మండేపల్లి గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) లో భాగంగా అయి -సోషల్ వెల్ఫేర్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమ కో ఆర్డినేటర్ , ప్రకృతి వ్యవసాయ నిపుణులు గారంపల్లి శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ అధ్యక్షతన మండేపల్లి గ్రామంలో రైతులకి సోమవారం రోజున ప్రకృతి వ్యవసాయంపై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఘన, ద్రవ జీవామృతం, కాషాయల తయారీ విధానం తద్వారా పంటల సంరక్షణ వంటి అంశాల పై అవగాహనా కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ ప్రభుదాస్, ప్రతాపరెడ్డి, శశి ఏఇ ఓ కరుణాకర్,సీఆర్ పీ జమున, జ్యోతి మరియు రైతులు దుర్గరెడ్డి, శ్రీనివాస్, ఆనంద్, సి ఏ శ్రీనివాస్, కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ లచ్చి రెడ్డి లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here