బలగం టీవి : ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం నామాపూర్ తండాలో బాల్యవివాహాల నిషేధ చట్టంపై ఎస్సై శేఖర్ రెడ్డి, పి ఓ ఐ సి శ్రీనివాస్,ఓ ఆర్ డబ్ల్యు గౌతమి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా తండా వాసులతో బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలు,నష్టాల పట్ల వారికి అవగాహన కల్పించారు. చట్టాలను ఉల్లంఘించడం ద్వారా ఎదురయ్యే ఇబ్బందులను వారికి వివరించారు.ఆడపిల్లలను చదివించడం ద్వారా కలిగే ప్రయోజనాలు వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని భరోసా కల్పించారు. ఆడపిల్లల భద్రత కోసం పటిష్టమైన చట్టాలు ఉన్నాయని,ఏమైనా ఇబ్బందులు ఉన్న తమను సంప్రదించాలని ఎలాంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని ఎస్సై శేఖర్ రెడ్డి సూచించారు.