- హాజరైన ఎస్డిపిఓ ఉదయ్ కుమార్.
బలగం టివి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కులాలకు చెందిన సంఘ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్డిపిఓ ఉదయ్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
వ్యక్తి హక్కుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎవరినైనా కుల బహిష్కరణ చేసినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.పంచాయతీ పేరుతో డబ్బులు వసూలు చేయడం చట్ట రీత్యా నేరమని తెలియజేశారు.రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని తాగి వాహనాలు నడపకుండా ఉండాలని,చిన్న పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.సీసీ కెమెరాలు యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ దేవాలయాలు, షాపింగ్ మాల్స్,ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ ప్రజా సమస్యలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వివిధ కులాల సభ్యులు పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు.