బలగం టివి, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొత్తపేట గ్రామ ఇల్లెందుల బాలయ్య అయోధ్య శ్రీరాములవారిని దర్శించుకున్న సందర్భంగా అయోధ్య నుండి తీసుకువచ్చిన ప్రసాదంను హనుమాన్ దేవాలయంలో గ్రామ ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: సకాలంలో వర్షాలు కురవాలని, పాడిపంటలు బాగా పండాలని అందరూ బాగుండాలని భగవంతున్ని కోరుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జి.రమేష్,ఏఎంసి డైరెక్టర్ చిందం వేణు ఆలయ కమిటీ చైర్మన్ కొండగల రమేష్, ఆలయ కమిటీ సభ్యులు కొమురయ్య, చిందం శ్రీనివాస్,సాగర్, శ్రీనివాస్ మరియు ఆలయ అర్చకులు రమేష్ పంతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.