బలగం టీవి , ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనములో అందరికీ అందుబాటులో ఉంచి ప్రతి నిత్యం పూజలు చేశారు.అట్టి అక్షింతలను ఎల్లారెడ్డిపేట మండలం లోని వివిధ గ్రామాలకు పంపించి కార్యకర్తలతో ప్రతి ఇంటికీ శనివారం పంపించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు.ఈనెల 15వ తేదీ వరకు విస్తృత జనసంపర్క్ అభియాన్ పేరిట శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తెలిపారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి పల్లె, ప్రతి పట్టణం నుంచి ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె, తండా, గ్రామం, మండల కేంద్రంల్లో శ్రీ రాముని అక్షింతలు పంపిణీ చేసినట్లు వారు వెల్లడించారు.ఈ నెల 22 న అయోధ్య లో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఇంట్లో దీపాలు వెలిగించి అక్షింతలను దేవుని వద్ద చల్లి కుటుంబ సభ్యులు తమపై చల్లుకొని తరించాలని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.ఈ పంపిణీ కార్యక్రమంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పూజారి నవీన్ చారి,సత్సంగ సదనం ప్రతినిధులు లక్ష్మమ్మ, గంప నాగేంద్రం గుప్త,రేవూరి లక్ష్మీనారాయణ గుప్త,బొమ్మకంటి రవీందర్ గుప్తా, నగుబోతు రాము గుప్తా,ముత్యాల ప్రభాకర్ రెడ్డి, రమేష్,ప్రభాకర్,సుంకి భాస్కర్, దొడ్ల సంజీవ్,గోశిక దాసు,ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్,గడ్డం జితేంధర్,వైస్ ప్రెసిడెంట్ గంట వెంకటేష్ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,నాయకులు దూస శ్రీనివాస్, ఎనుగందుల నరసింహులు బిజెపి పార్టీ నాయకులు దొంతి అమర్, సందుపట్ల లక్ష్మారెడ్డి,పారి పెళ్లి సంజీవరెడ్డి,పారి పెళ్లి రామ్ రెడ్డి, కృష్ణ భక్తులు సనుగుల ఈశ్వర్, షకిలం నారాయణ గుప్తా,పోతూ ఆంజనేయులు గోదా గోష్టి మహిళా భక్త బృందం కాంగ్రెస్ పార్టీ నాయకులు నేవూరి రవీందర్ రెడ్డి, పందిర్ల శ్రీ నివాస్ గౌడ్,వార్డు సభ్యులు, పాల్గొని శ్రీరామ్ జై రాం జై జై రాం ,,,,, రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కీ అనే నినాదాలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం మారుమోగింది,రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ భక్తులు భక్తి పాటల తో భజనలు చేస్తూ ముందుకు సాగారు.
