బలగం టివి: రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల పట్టణ సిఐగా బి రఘుపతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సిరిసిల్ల టౌన్ సిఐగా పని చేసిన భిమానాథుని ఉపేందర్ ఎన్నికల కోడ్ నేపధ్యంలో బదిలి అయ్యారు. ఈ సందర్భంగా సి.ఐ రఘుపతి మాట్లాడుతూ…పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలవాలని, శాంతి భద్రతల విషయంలో అందరూ సహకరించాలని కోరారు.