సిఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
బలగం టివి,ఎల్లారెడ్డిపేట:
చెన్నూరు ఎమ్మెల్యే మాజీ బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వాక్యాలను నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడిన తీరు సరికాదు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఏకంగా మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బాష సరికాదు అని ,దినీనీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు. ఇలాంటి సంఘటనలను బీఆర్ఎస్ పార్టీ అదుపులో పెట్టకపోతే రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతుందిఅని అన్నారు.అలాగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు గుణపాఠం బీఆర్ఎస్ పార్టీకి చెప్పినప్పటికీ నాయకుల తీరులో మార్పు రాకపోవడం దురదృష్టకరం.ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలాంటి దుర్భాషలకు దిగకుండా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చర్యలు తీసుకోకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెబుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
