అధికారం కోసమే బండి సంజయ్ అడ్డగోలు అబద్దాలు

0
89

బలగం టివి,  రాజన్న సిరిసిల్ల

➡️ఇంకెన్ని రోజులు ప్రజల మనోభావాలతో ఆడుకుంటావ్ బండి సంజయ్

➡️ఐదేళ్లలో ఎం చేశాడని..బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడు

➡️ఎన్నికలు రాగానే బండి సంజయ్ కి ప్రజలు గుర్తొస్తున్నారు

➡️కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్

➡️ఎంపీ హోదాలో ఉండి అబద్దాలు చెప్తున్నాడు

➡️ కేంద్రం ప్రతి ఏడాది వివిధ పథకాలకు ఇచ్చే నిధులను కూడా బండి ఇస్తున్నట్లు అబద్దాలు

➡️బండి సంజయ్ ఎంపీ అయ్యాక ఒక్క నవోదయ పాఠశాల అయిన తెచ్చాడా

➡️నేను 2014లో ఎంపీ అయ్యాక రైల్వేలైన్ తెచ్చాను

➡️సాధ్యం కాకున్నా కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చాను

➡️బండి సంజయ్ వ్యక్తిగత దూషణలు మానుకోవాలి

➡️నర్సింగపూర్ లో 20 ఎకరాల పొలం నా భార్య డాక్టర్ బోయినపల్లి మాధవి 30ఏళ్లుగా వైద్య వృత్తి చేసి సంపాదించిన సొమ్ముతో కొన్నారు

➡️ ఐదు వందల కోట్ల ఆస్తి ఎక్కడ ఉందో బండి సంజయ్ పత్రాలు తెస్తే సంతకం పెడతా

➡️సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు మాటలు పద్దతిగా లేవు

➡️గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినట్లు గంపాలు కొడుతున్నారు

➡️యాసంగి పంటకు క్వింటాలుకు ₹500ల బోనస్ ఇవ్వాలి

➡️డిసెంబర్ చివరి నాటికి 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి

కేసీఆర్, కేటీఆర్ లపైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యక్తిగత దూషణాలు చేయడం పద్ధతి కాదని, ఎంపీ హోదాలో ఉండి గసొంటి సోయిలేని మాటలు మాట్లాడటం ఏంటని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధిహామీ, హరితహారం, అంగన్ వాడి, ప్రధానమంత్రి సడక్ యోజక వంటి పథకాలకు నేరుగా వచ్చే నిధులను కూడా తానే తెచ్చినట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ పార్టీ వారు ఎంపీ హోదాలో ఉన్న కూడా వస్తాయని,
గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలకు అదనంగా 100 రోజులు పని కల్పించాలని ఉపాధిహామీ పథకాన్ని 2005లో అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం ఇది ప్రజల హక్కన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తాను ఇచ్చినట్లు బండి చెప్పడం హాస్యస్పదంగా ఉందని, పోస్టర్లలో ప్రధాని నరేంద్రమోడీ గారిని బండి సంజయ్ కించపరుస్తున్నాడన్నారు. ఐదేళ్ల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గములో జాతీయ రహాదారి అయినా తెచ్చాడా, ఐఐఐటీ, నవోదయ పాఠశాల, పరిశ్రమలు, మెడికల్ కళాశాల, ఒక్క పవర్ లూం క్లస్టర్ అయిన తెచ్చావ బండి సంజయ్ అని ప్రశ్నించారు. నేను 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్న సమయంలో అవకాశం లేని కరీంనగర్ కు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా స్మార్ట్ సిటీ తీసుకొచ్చి,వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.70 ఏళ్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి సికింద్రాబాద్(మనోహరబాద్)-కరీంనగర్(కొత్తపల్లి)
రైల్వేలైన్ మంజూరు చేయించి ప్రస్తుతం సిద్దిపేట వరకు రైలు నడపటం జరుగుతుందన్నారు. ఎల్కతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, ఫిట్లం వరకు జాతీయ రహాదారి మంజూరు చేయించి నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. కరీంనగర్ లో ఐఐటీ నిర్మాణం కోసం అప్పటి కలెక్టర్ నీతూ ప్రసాద్ భూమి కూడా కేటాయించారని, కానీ బండి సంజయ్ ఎంపీ అయ్యాక కరీంనగర్ ఐఐఐటీ కోసం నోరుమెదపలేదన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఉండాలని, గ్రామీణ పేద వర్గాలకు చెందిన పిల్లలకు విద్య అందాలనేది లక్ష్యమని,
కానీ తెలంగాణ లో 9 మాత్రమే నవోదయ పాఠశాలలు ఉన్నాయని, మరో 23 ఇవ్వాలని పదేళ్ల కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదుల సంఖ్యలో లేఖలు రాశారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినప్పటికి ఒక్క నవోదయ పాఠశాల కూడా సాధించలేరని పేర్కొన్నారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి..పోతుంటాయి ఎవరు శాశ్వతం కాదని,
బండి సంజయ్ పాదయాత్రలో వ్యక్తిగత దూషణలు మానుకోవాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని బండి సంజయ్ మాట్లాడుతన్నారని, పొత్తులు అనేది ఎవరి చేతుల్లో లేదని అన్నారు. బండి సంజయ్ ఎంపీ హోదాలో ఉండి నోటికి ఏది వస్తే అది మాట్లాడు తున్నారని పేర్కొన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ కు నర్సింగపూర్ లో 20 ఎకరాల భూమి ఉందని, బండి సంజయ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశాడు….కానీ నా సతీమణి డాక్టర్ బోయినపల్లి మాధవి 30 ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నారు… తనకు మమత మెడికేర్ సెంటర్ ఉందని.. తన కష్టార్జితంతో సంపాదించిన సొమ్ముతోనే భూమి కొన్నదని పేర్కొన్నారు. నాకు హైదరాబాద్ లో 500ల కోట్ల ఆస్తి ఎక్కడ ఉందో బండి సంజయ్ ఆస్తి పత్రాలు తీసుకోస్తే సంతకం పెడతానని, బండి సంజయ్ అడ్డగోలు అబద్దాలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడాలని అన్నారు. నా గురించి
రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులను అడుగు బండి సంజయ్. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాటలు సరికాదని,యాసంగి పంటకు
500 బోనస్ ఇస్తున్నారో లేదో అసెంబ్లీలో సీఎం సమాధానం చెప్పాలని కోరారు. ఏఫ్రీల్,మే మాసాల్లో క్వింటాలుకు 500ల బోనస్ ఇచ్చే దాకా కోట్లాడతామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు అవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కానిస్టేబుల్, స్టాప్ నర్సు, గురుకుల ఉపాధ్యాయుల పరీక్షలు నిర్వహించి కోర్టు కేసులు ద్వారా నియామకాలు నిలిచిపోతే 25000ల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 60 గ్రూప్ 1 పోస్టులు మాత్రమే యాడ్ చేశారని, కానీ ఇప్పటి వరకు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు…ఎప్పుడు ఖాళీలను గుర్తిస్తారు… డిసెంబర్ చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆడుకుంటున్నాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెక్స్ టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, అక్కరాజు శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బోయినపల్లి జడ్పీటీసి ఉమాకొండయ్య, గజబింకార్ రాజన్న, జక్కుల నాగరాజు యాదవ్, మల్లారెడ్డి, సుదగోని శ్రీనాథ్ గౌడ్, బొల్లి రామ్మోహన్, సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here