ప్రజాక్షేత్రంలో గెలువలేక బండి సంజయ్ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు
ఎంపీ హోదాలో ఉండి నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు
దమ్ముంటే మెడిగడ్డ బ్యారేజ్ సబ్ కాంట్రాక్టు ఎవరికి ఇచ్చారో తేల్చాలి
కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్
బలగం టివి,సిరిసిల్ల
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఎల్అండ్ టీ సంస్థ ను కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ బెదిరించడంతో అతడి బంధువులకు సబ్ కాంట్రాక్టు ఇచ్చారని, సబ్ కాంట్రాక్టు పనులు చేసిన వారిని అరెస్టు చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గాలిమాటలు మాట్లాడుతున్నారని,గిసొంటి సోయిలేని మాటలు మానుకుని అసలు నిజాలేంటో బండి సంజయ్ నిరూపించాలని క రీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.మంగళవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడు తూ ఎంపీ హోదాలో ఉండి బండి సంజయ్ మతిలేని మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని,ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ప్రతి మాటకు ఒక పద్ధతి ఉంటుందని, కానీ బండి సంజయ్ ఇలా అడ్డగోలు గా గాలిమాటలు మాట్లాడితే ప్రజలు పట్టించుకోరని అన్నారు.బండి సంజయ్ ని సూటిగా అడుగుతున్న ఎల్ అండ్ టి సంస్థ మేడిగడ్డ సబ్ కాంట్రాక్టు ఎవరికి ఇచ్చిందో తెలిస్తే పేరు బయట పెట్టాలని, అసలు మాజీ ఎంపీ ఎవరో, అతడి బంధువులు ఎవరో చెప్పాలని,బండి సంజయ్ ఎవరిని అన్నారో చెప్పాలని అన్నారు.బండి సంజయ్ కి ధైర్యం లేదు…ఆరోపణలు చేస్తే ధైర్యంగా నిజాలు చెప్పాలని పేర్కొన్నారు.
2014 నుండి 2019 వరకు ఎంపీగా ఉన్నానని, అంతకు ముందు పొన్నం ప్రభాకర్, కేసీఆర్, చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఎల్.రమణ గార్లు ఎంపీలుగా ఉన్నారని ఇందులో ఎవరి బంధువులకు మేడిగడ్డ బ్యారేజ్ సబ్ కాంట్రాక్టు ఇచ్చారో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు.బండి సంజయ్ ఎల్అండ్ టి సంస్థ సబ్ కాంట్రాక్టు ఇచ్చిందా లేదా అనే విషయాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగి బయట పెట్టాలని అన్నారు.ఎంపీగా గెలిచి ఐదేళ్లు అవుతున్నా బండి సంజయ్ కి ఐదేళ్లలో ప్రజలు గుర్తుకు రాలేదని ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్లీ బండి సంజయ్ కి ప్రజలు గుర్తుకు వచ్చారని,ఐదేళ్లలో ఐదు కొత్తల నిధులు తేలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు.ఉపాధి హామీ పథకం, హరితహారం, నేషనల్ హెల్త్ మిషన్, వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా నిధులు ఇస్తుందని, అవన్నీ తన నిధులేనని,ఎంపీగా ఐదేళ్ల లో బండి సంజయ్ ఏం సాధించారొ చెప్పాలని, అభివృద్ధి కి నిధులు తేవడం చేతకాక బండి సంజయ్ గెలికి కయ్యం పెట్టుకుంటున్నారని అన్నారు.
ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి ఖాయమని గ్రహించి బండి సంజయ్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారనీ,నేను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కేంద్రానికి వందల సంఖ్యలో లేఖలు రాయడం జరిగిందన్నారు.మేడిగడ్డ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ ఎవరనేది బండి సంజయ్ చెప్పకుంటే నిరాధారమైన ఆరోపణలు మాట్లాడినట్లు గ్రహించిబండి సంజయ్ తప్పును అర్థం చేసుకుని పాదయాత్ర రద్దు చేసుకుని వెళ్లిపోవాలన్నారు.బండి సంజయ్ పచ్చి అబద్దాలు చెబుతూ, ప్రజల్లో అలజడి సృష్టించాలని చూస్తున్నారని..ఇవి బీజేపీ సిద్దాంతాలా,కానీ బండి సంజయ్ ఎంపీగా గెలిచి ఏనాడైనా ప్రజా సమస్యలపై సంధించారాగ్రామాల్లోకి వెళ్ళారా అని ప్రశ్నించారు.బండి సంజయ్ ఎప్పుడు మతం ముసుగులో రాజకీయం చేస్తూ కుల,మతాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని, వేములవాడ,కొండగట్టు, ఇల్లందకుంటా సీతారామాలయం గుడుల అభివృద్ధి కోసం బండి సంజయ్ నయాపైసా నిధులు తేలేదని అన్నారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గములో బండి సంజయ్ ఒక్క నవోదయ పాఠశాలను సాధించలేకపోయాడని అన్నారు.మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన విషయంలో జ్యుడిషియల్ విచారణ జరిపితే అభ్యంతరం లేదని, బీఆర్ఎస్ పార్టీ గతంలోనే చెప్పడం జరిగిందని అన్నారు.ప్రస్తుత యాసంగి సీజన్ లో సాగు నీళ్లకొసం రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే మేడిగడ్డ నుంచి నీళ్లను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
