బలగం టివి, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగింది. సిరిసిల్ల పట్టనంలో మార్కండేయ జయంతి సందర్బంగా మార్కండేయ దేవాలయంలో బండి సంజయ్ పూజలు నిర్వహించారు. సిరిసిల్ల పద్మశాలీయులకు మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల లో నిర్మిస్తున్న మార్కండేయ దేవాలయ నిర్మాణంనకు అందరు సహకరించాలని కోరారు. పార్లమెంటు సభ్యుడిగా తాను కూడా సహకరిస్తానని పేర్కొన్నారు. సిరిసిల్ల లో ఒక పవర్ ఫుల్ దేవాలయంగా మార్కండేయ దేవాలయం తీర్చిదిద్దుకోనుందన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బీజేపి నాయకులతో పాటు పద్మశాలీ సంఘం నేతలు పాల్గొన్నారు.

వేములవాడ నియోజకవర్గంలో..
3వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ ప్రజాహిత యాత్రవేములవాడ నియోజకవర్గం బాలరాజు పల్లెలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రబాలరాజుపల్లెలో ఇంటింటికీ వెళుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న బండి సంజయ్మోదీ ప్రభుత్వ విజయాలను, బాలరాజుపల్లె అభివ్రుద్ధి కోసం కేంద్రం ఖర్చు చేసిన నిధులను వివరిస్తున్న బండి సంజయ్కమలం పువ్వుకు ఓటేసి మోదీని మళ్లీ ప్రధాని చేయాలని ప్రజలను అభ్యర్ధిస్తున్న బండి సంజయ్కాసేపట్లో అచ్చెన్నపల్లి, చెక్కపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేయనున్న బండి సంజయ్మధ్యాహ్నం 12 గంటలకు నూకలమర్రికి చేరుకోనున్న బండి సంజయ్నూకల మర్రిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న డ్రామాలపై నిప్పులు చెరగనున్న బండి సంజయ్