బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షునిగా తడక కమలాకర్

0
308

సిరిసిల్ల న్యూస్​:
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షునిగా తడక కమలాకర్ ను నియమిస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు, కమలాకర్ గత పది సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం లో బీసీ ఉద్యమంలో బీసీ సమస్యల పరిష్కారంలో క్రియాశీలంగా పనిచేసినందున అతని సేవలను గుర్తించి పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తున్నట్టు తన ఉత్తర్వు లో పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు, బీసీ సంక్షేమ సంఘం ను సిరిసిల్ల పట్టణంలో బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్టు పర్శ హన్మాండ్లు అన్నారు, ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు గారికి జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేష్ యాదవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here