-రుద్రంగి ఎస్ ఐ
బలగం టివి, రుద్రంగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బుధవారం సైబర్ జాగృక్తా దివాస్ కార్యక్రమంలో భాగంగా రుద్రంగి ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు.. వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో అనేక రకాలుగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని వాటి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు..సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 టోల్ ప్రీ నెంబర్ కి కాల్ చేయాలి అలాగే సంబంధిత పోలీస్ స్టేషనకి రావాల్సిందిగా తెలియజేసినారు.. అదేవిదంగా మాధక ద్రవ్యాలా వాడకం(గంజాయి)దాని వలన నష్టాలు,వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు..ఈ కార్యక్రమం లో రుద్రంగి ఎస్సై అశోక్,స్కూల్ కరస్పాండెంట్ ఎర్రం గంగనర్సయ్య,ప్రిన్సిపాల్ హరినాథ్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..