మండల సిపిఎం పార్టీ శాఖ
బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా గ్రామీణ ప్రాంత గ్రామాలలో బెల్ట్ షాపులు ఎత్తివేయాలని బోయినిపల్లి మండల కేంద్రంలో మండల సిపిఎం పార్టీ శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురుజాల శ్రీధర్ మాట్లాడుతూ: ఒక్కొక్క గ్రామాల్లో సుమారు 5 నుంచి 6 బెల్ట్ షాపులు, అలాగే కొద్దిగా జనాభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో 10 బెల్ట్ షాపులు దాకా నడుస్తున్న సందర్భంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల గ్రామీణ ప్రాంతా యువకులు మద్యానికి బానిస అవుతున్నారు.అలాగే గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఈ మద్యం మహమ్మారి విచ్చలవిడిగా నడపడం వల్ల ప్రశాంతంగా ఉండవలసిన పల్లెలు అశాంతికి గురవుతున్నాయి.మత్తులో పడి యువకులు చిన్నచిన్న కారణాలతో గొడవలు సృష్టించుకుని, చిలికి చిలికి గాలివానగా మారి, శాంతిభద్రతలకు విగాతం గలిగే విధంగా ప్రశాంతంగా జీవిస్తున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ మద్యం మహమ్మారి బెల్టు షాపుల రూపంలో కొరివిరాని కొయ్యగా తయారైంది.కాబట్టి ఈ మధ్యం మహమ్మారి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి గట్టిగా ఆదేశాలిచ్చి సాధ్యమైనంత త్వరలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన మాటకు కట్టుబడి మద్యం షాపులు పూర్తిగా ఎత్తివేస్తే గ్రామాల్లో అశాంతికి చోటు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా దోహదపడతాయని,అలాగే క్రిమినల్ యాక్ట్స్ తగ్గే అవకాశం ఉంటుందని,ఆ దిశగా గ్రామీణ ప్రాంత ప్రజల సౌఖ్యమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం తక్షణమే మద్యం షాపులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల రామంచ అశోక్ తదితరులు పాల్గొన్నారు.