బలగం టివి,సిరిసిల్ల:
సంత్ సేవాలాల్ సేవాసమితి రాజన్న సిరిసిల్ల జిల్లా కో కన్వీనర్, ఆలిండియా బంజారా సేవ్ సంఘం మండల అధ్యక్షుడు, లంబాడి ఐక్యవేదిక మండల అధ్యక్షులు అజ్మీర భాస్కర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ అధ్వర్యంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టి నియోజికవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరికి కేకే మహేందర్ రెడ్డి కండువ కప్పి పార్టిలో కి అహ్వనించారు.ఈ సందర్బం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలకు ప్రజలు ఆకర్షితులైతున్నారని అన్నారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి మాటలకే పరిమితమైన కేసీఆర్ కి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎస్టీలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని ఎస్టీలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జగదాంబ తండ గ్రామ శాఖ అధ్యక్షులు విఠల్ నాయక్ దమనపేట గ్రామ శాఖ అధ్యక్షులు బలరాం రెడ్డి సాయి రెడ్డి కొండం బాల్ రెడ్డి ప్రాథమిక సహకార సంఘ సభ్యులు లాల్య నాయక్ ,నాయకులు బడావత్ వర్జున్ ,భూక్య దర్సింగ్, చందు నాయక్, శ్రీరామ్, అజ్మీర సురేష్ ,మూడ్ భాస్కర్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు