బలగం టీవీ, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో ఇటీవల రెండవ సాధారణ సర్పంచ్ ఎన్నికలు జరగగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి మర్లపేట గ్రామ సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా బోయినిపల్లి సర్పంచ్ నల్లమోహన్, తడగొండ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కౌడగానీ వెంకటేష్ (రత్నంపేట), సహాయ కార్యదర్శిగా కట్ట గోవర్ధన్ (మానువాడ), కోశాధికారి జంగం అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా కొప్పుల లావణ్య, సుద్దాల మధు, ఇల్లందుల రాజేశం, చింతలపల్లి కవిత, ఇరువాలా సంధ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
