బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 04–03–2025 రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల బొప్పాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ చేసినారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలో అమలవుతున్న కేంద్ర ఆరోగ్య పథకాలపై ఆశాలతో మరియు వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ సమావేశంలో మాతా శిశు ఆరోగ్యము సమీక్షించి గర్భవతుల నమోదు,గర్భవతుల చెకప్ లలో వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా ఇప్పించవలసిందిగా సూచిస్తూ,సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలని ఈ సందర్భంగా తెలియజేసినారు. వైద్యాధికారి సారియా,వైద్యులు ఆశాలు పాల్గొన్నారు.
