ప్రెస్ క్లబ్ భవన నిర్మాణనికి భూమిపూజ

0
115

బలగం టివి, తంగళ్లపల్లి

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రక్కన నూతనంగా నిర్మించబోయే ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ బండి సంజయ్ కుమార్,ఎంపీపీ పడగల మానస,జడ్పిటిసి పుర్మాని మంజుల,సెస్ చైర్మన్ చిక్కాల రామారావ్, మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ,వైద్య శివప్రసాద్, సత్తు శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు.నూతనంగా నిర్మించబోయే ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుండి పది లక్షల రూపాయలు కేటాయించాలని ఎంపీ బండి సంజయ్ కి వినతిపత్రం అందజేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి మండల పరిషత్ నుండి నిధులు కేటాయించిన ఎంపీపీ పడగల మానస రాజు,మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య లకు, అలాగే జిల్లా పరిషత్ నుండి బోర్,మోటార్ కు నిధులను కేటాయించిన జెడ్పిటిసి పుర్మాని మంజుల లింగారెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు సిరిపాక ప్రణయ్,ప్రధాన కార్యదర్శి రంగు శ్యామ్,సహాయ కార్యదర్శి దుబ్బాక రాజు, గౌరవ సలహాదారులు పిల్లి శ్రీనివాస్,అందే దేవేందర్, సామల గట్టు,వెంగళ శ్రీనివాస్,క్లబ్ సభ్యులు పుర్మాని రామ్ లింగారెడ్డి,మోర శ్రీకాంత్,అనిల్ రావ్,బాలు,రెడ్డి శేఖర్,మధు,కళకుంట్ల శ్రీనాథ్ రావు,గాధగోని సాగర్ గౌడ్,పరశురాములు,దినేష్, సంతోష్,ప్రశాంత్,రాజేష్ లతో పాటు అన్ని పార్టీల నాయకులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here