బలగం టివి, తంగళ్లపల్లి
కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సహకారంతో సారంపల్లి గ్రామంలో కొమ్మేట నరేష్ ఇంటి నుండి కొమ్మేట దాసు ఇంటి వరకు 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు మరియు పెద్దమ్మ గుడి వద్ద 2 లక్షల రూపాయల నిధులతో బోరు మరియు మోటార్ మంజూరు చేయగా కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పూర్మని మంజుల లింగారెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు టోనీ, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి,వైద్య శివప్రసాద్, గుగ్గిళ్ల భరత్ గౌడ్, మునిగల రాజు, ఏగుర్ల ప్రశాంత్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.