కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ
బలగం టివి ,సిరిసిల్ల:
పార్లమెంట్ ఎన్నికల కు ముందు బీఅర్ ఎస్ కి భారీ షాక్ తగిలింది.
పెద్దపల్లి ఎంపీ బోర్ల కుంట వెంకటేష్ నేత కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మంగళవారం ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేసి వేణుగోపాల్ ఎంపీ వెంకటేష్ నేతకు కండువా కప్పి కాంగ్రెస్ గూటికి ఆహ్వానించారు. బోర్ల కుంట వెంకటేష్ నేత 2018 అసెంబ్లి ఎన్నికల్లో చేన్నురు నియాజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి గా బాల్క సుమన్ పై పోటి చేసి ఓడిపోయారు.అనంతరం బీఅర్ఎస్ పార్టిలో చేరి పార్లమెంట్ ఎన్నికలలో బీఅర్ఎస్ తరుపున పోటి చేసి ఎంపి గా గెలుపోందారు.