బలగం టీవి .., తంగళ్ళపల్లి
సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా మండలంలోని గండి లచ్చపేట గ్రామంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.నాడు సావిత్రిబాయి అందరి కి చదువు అందుబాటులోకి రావాలని అహర్నిశలు కృషి చేశారు.సావిత్రిబాయి పూలే త్యాగాలను,ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ అధ్యక్షులు బల్లెపు దేవయ్య,కర్రోళ్ల చంద్రయ్య,వైస్ ఎంపీపీ జింగిటి అంజయ్య, బిఆర్ఎస్ నాయకులు నీరటి బాబు,బల్లెపు శ్రీను,బల్లెపు ప్రశాంత్,ముదిరాజ్ సంఘ సభ్యులు పడిగే శ్రీనివాస్ జంగిటి శ్రీనివాస్,పడిగే నారాయణ,బీపేట మల్లయ్య పాల్గొన్నారు.