బలగం టివి: హైదరాబాద్:

మలి దశ తెలంగాణ ఉద్యమ కవి, ప్రజా వాగ్దేయకారుడు, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో జిల్లా నృత్య కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ముందుగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, కేక్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొన్న జాతీయ స్థాయి జానపద కళాకారుడు దమ్మాల శ్రీనివాస్ మాట్లాడుతూ మలి దశ తెలంగాణ ఉద్యమంలో అట్టడుడుగు ప్రజలను చైతన్యం చేసిన ఉద్యమ ప్రజా వాగ్గేయ కారుడు మిట్టపెల్లి సురేందర్ అని అన్నారు. ప్రజా సమస్యలపై తన కలం, గళం ద్వారా ఉద్యమించిన ప్రజా కవి అని అన్నారు. సీనియర్ కొరియో గ్రాఫర్ ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ తన అట పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పల్లె పల్లెకు చేర్చాడని అన్నారు. అనునిత్యం ప్రజల కోసం తన పాటను అంకితం చేసిన గొప్ప ప్రజా కవి అని కొనియాడారు. జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షుడు రాకం సంతోష్ మాట్లాడుతూ సామాజిక అంశాలపై తన పాటలతో రచనలు చేస్తూ ప్రజలను చైతన్య పర్చిన ప్రజా కవి మిట్టపెల్లి సురేందర్ జన్మదిన వేడుకలను దివ్యాంగుల మద్య జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సీనియర్ డాన్స్ మాస్టర్స్ రిథమ్ సది, ఉడుత సాగర్, ఎర్రవేని రమేష్, విజయ్, రంజిత్, చింతనిప్పుల అరుణ్ సాయి తదితరులు పాల్గోన్నారు.
