బలగం టీవీ ఎల్లారెడ్డిపేట :
పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లోని బిజెపి నాయకులు టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నా సందర్భంగా ఘన విజయం సాధించినందుకు మండలంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమం మండల కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో ఇతర పార్టీలు గెలవలేరని నిబద్దతగా పనిచేసే వారే ఎన్నికలలో విజయం సాధిస్తారని లక్ష్మారెడ్డి దుయ్యబట్టారు. కమలం వికసిస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,కార్యకర్తలు అందరూ పాల్గొనారు.