బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో 11/6 కెనాల్ పనుల నిమిత్తం రైతులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ కెనాల్ పనులకు సంబంధించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ త్వరగా చేసి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ పైన ఉందని పేర్కొన్నారు. పనులు పూర్తి చేయని పక్షంలో ఉద్యమం ఇంకా ఉదృతం అవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన కచ్చితంగా పోరాడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఇటికాల రాజు నాగుల శ్రీనివాస్ సిలువేరు ప్రశాంత్ అమ్ముల అశోక్, దండ వేణి రజనీకాంత్, తుమ్మనపల్లి కమలాకర్ మరియు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.