సిరిసిల్ల జిల్లాలో బిజెపి: గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం..

0
104

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విజయ ఉత్సాహం మిన్నంటింది. బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో, ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతినిధులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన 32 మంది సర్పంచులు, 30 మంది ఉప సర్పంచులు మరియు 200 మంది వార్డు మెంబర్లు విజయం సాధించడం పట్ల బిజెపి పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో కష్టపడి గెలిచిన ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం శాలువాలతో సత్కరించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జ్ గంగిడి మోహన్ రెడ్డి విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో బిజెపి బలోపేతం కావడానికి ఈ విజయం ఒక సంకేతమని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, మెరుగు హనుమంత్ గౌడ్, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతి రెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బండ మల్లేశం, బర్కం లక్ష్మి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి (అంకిరెడ్డి పల్లె గ్రామ సర్పంచ్), జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు రావు, జిల్లా కార్యదర్శి కర్నె హరీష, జిల్లా మహిళా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, వీరితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, బిజెపి సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here