ఆపరేషన్ సింధూరం విజయం కావాలని బిజెపి నాయకుల ప్రత్యేక పూజలు..

0
102

ఆపరేషన్ సింధూరం విజయవంతం కావాలని శ్రీ రామాలయంలో బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు

బలగం టీవీ, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని బోయినిపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామలయంలో బిజెపి మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
పరశురాం మాట్లాడుతూ: పాకిస్తాన్ ఉగ్రవాదులపై మొదలైన యుద్ధం విజయవంతం కావాలని, మన సైనికులకు, దేశ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదని,ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, భారత్ ప్రధాని మోడీ అలాగే అమిత్ షా,భారత త్రివిధ దళాల సైన్యంకు శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలని రామలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించమని, అలాగే మండలంలోని అన్ని గ్రామాలలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పూజలో పాల్గొన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహ చారి, కిరణ్ రాజూరి, జువ్వెంతుల శ్రీనివాసరెడ్డి, చిలుముల రమేష్, భూమ్ రెడ్డి, అనిల్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here