బలగం టీవీ, బోయినిపల్లి :
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిధుల సహకారంతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో పోచమ్మ టెంపుల్ వద్ద భక్తుల సౌకర్యం కోసం బోర్ ను బుధవారం రోజున ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్, చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రావణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీపతి చంద్రశేఖర్, చిందం అంజన్ కుమార్,సౌత్ జొన్ ఉపాధ్యక్షులు కొడిత్యాల సురేష్, శక్తి కేంద్రం ఇంచార్జి ఆంజనేయులు దాసరి,బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పోచమ్మ గుడి అధ్యక్షులు దాది మోహన్, రామస్వామి,రాజశేఖర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
