బలగం టీవీ, కరీంనగర్ :
ఉగ్ర దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని బిజెపి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
కరీంనగర్ జిల్లా గంగధర మండలంలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరణ్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు మృతిచెందిన దారుణ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ, మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గంగాధర మండల భారతీయ జనతా పార్టీ గంగాధర మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో మధురానగర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గంగాధర మండల బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.