సిరిసిల్ల న్యూస్:ఎల్లారెడ్డిపేట
రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండలంలోని బిజెపి పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమదేవి.మండల కేంద్రంలోని బిజెపి పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సిరిసిల్ల నియోజకవర్గం లో మంత్రి కేటీఆర్ చేసిన అరాచకాలను అంతా కాదని అరచేతులు ఐసు ముక్కలు పెట్టి నిరుపేదకు వచ్చేసరికి అది కాస్త ఉత్త చేతులుగా అవుతున్నాయని అన్నారు. ఇక ఇసుక మాఫియా కు అడ్డు అదుపు లేకుండా ప్రకృతిని దోచుకుంటున్నారని ఎల్లారెడ్డిపేట బిజెపి నాయకులను కార్యకర్తలను ఇష్టమొచ్చిన కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ అరాచక పాలన తొలగాలంటే బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించండి అని ఆమె పేర్కొన్నారు.
