ఎల్లారెడ్డిపేట సర్పంచ్ బిజెపి అభ్యర్థి అంతేర్పుల తిరుపతి ప్రచారాన్ని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు
స్థానిక గాంధీ విగ్రహం నుండి ర్యాలీ మహిళలతో ఫుట్బాల్ గుర్తును ప్రదర్శిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మొదటగా మహనీయుడు గాంధీ విగ్రహానికి బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ముఖ్యఅతిథిగా హాజరైన పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నంది నరేష్, జిల్లా సీనియర్ నాయకులు రావుల గాల్ రెడ్డి, పారిపెల్లి సంజీవరెడ్డి కార్యకర్తలు యువకులు మహిళలు గ్రామస్తులు హాజరయ్యారు.
ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సర్పంచ్ అభ్యర్థి అంతేర్పుల తిరుపతి నేడు భారీ ఎత్తున ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు.

