వేములవాడలో కచ్చితంగా పోటీలో ఉంటా

0
149

సిరిసిల్ల న్యూస్​:

  • బీసీ బిడ్డ, మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దా..
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుల ఉమ.. ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:
    వేములవాడలో బీసీ బిడ్డగా, మహిళగా బిజెపి పార్టీ అవకాశం కల్పిస్తే, కొంతమంది కుట్రలు చేస్తున్నారని, కచ్చితంగా వేములవాడలో పోటీ చేస్తానని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుల ఉమ అన్నారు.శుక్రవారం వేముల వాడ నియోజకవర్గం నుండి తుల ఉమ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడుతూ నక్సలైట్ అన్నారు,అనాడు దొరల నుండి ప్రజల విముక్తి పై కోట్లాడిన,ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో వేములవాడలో ఎలక్షన్ బరిలో నిలిచి కోట్లాడుత అని అన్నారు.బీసీ బిడ్డగా, మహిళగా వేములవాడ నుండి పోటీ చేసే అవకాశం బిజెపి పార్టీ కల్పిస్తే, కొంతమంది కుట్రలు పని అడ్డుకుంటున్నారని,
    గోర్లు కాసుకునే వారు శాసనసభలు అడుగు పెట్టొద్దా అని కన్నీటి పర్వతమయ్యారు.వేములవాడ లో దొరల కే అవకాశం ఇస్తారా,వేరే వారికి అవకాశము ఇవ్వరా ప్రశ్నించారు. బీజేపీ పార్టీ ఇటీవలే మహిళల కి 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు తప్ప, ఆచరణలో చూపెట్టడం లేదని, కనీసం మహిళలకు 10 నుండి 12 శాతం కూడా ఇవ్వడం లేదని అన్నారు. నా ప్రజా జీవితంలో ప్రజలకు మేలు చేశా తప్ప, ఎవ్వరికి ఏ హాని చేయలేదని, అందుకే ప్రజా నాయకురాలుగా ఎదిగానని అన్నారు.
    బీ జే పీ పార్టీపై ఇంకా నమ్మకం ఉంది అని,పార్టీ బీసీ బిడ్డగా, మహిళగా వేములవాడ నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వక పోతే బిసి లకు, మహిళలకు ఇక బీజేపీ లో అవకాశాలు ఉండవు అని అన్నారు. వేములవాడ లో కచ్చితంగా పోటీలో ఉండి , కొట్లాడుతానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here