హిందూ దేవుళ్లపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిరిసిల్లలో బీజేపీ ‘నల్ల బ్యాడ్జీ’ నిరసన..!

0
45
  • బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బుధవారం రోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ (BJP) సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. హిందూ దేవుళ్ళను అవమానించే ధైర్యం ఎవరికి ఉండకూడదని, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి హిందూ భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అర్హతలేనిది, బాధ్యతారాహిత్యం. హిందూ సమాజం శాంతిని ప్రేమిస్తుంది, కానీ అవమానాన్ని అస్సలు సహించదు. ఇంతకుముందు, మాజీ మంత్రి కేటీఆర్ ‘నేను దేవుళ్లను నమ్మను’ అన్న వ్యక్తిని హనుమాన్ స్వాములతో కూర్చోబెట్టి హనుమాన్ జపం చేయించిన ఘనత బీజేపీది అని గుర్తు చేశారు. ఇకపై ఎవ్వరైనా హిందూ దేవుళ్లపై అపమానకర వ్యాఖ్యలు చేస్తే, BJP దీన్ని అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటుంది. మేము నిశ్శబ్దంగా కూర్చోబోము, అని హెచ్చరిక చేశారు.

ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి హిందూ భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అర్హతలేనిది, బాధ్యతారాహిత్యమని, హిందూ సమాజ ఏకతను బలంగా ప్రదర్శించడం, ప్రజలు & కార్యకర్తల నుండి ఈ నిరసనకు విస్తృత స్పందన లభించిందని పేర్కోన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రామ్ ప్రసాద్, సీనియర్ నాయకులు గూడూరి భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షులు మోర శ్రీహరి, అంకారపు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శులు మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, అధికార ప్రతినిధులు మోర రవి, చొప్పదండి శ్రీనివాస్, దూడం సురేష్, సూరం వినయ్, చొక్కి శ్రీనివాస్, రచ్చ రాహుల్, నరసయ్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here