బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్–2026’ జిల్లా స్థాయి కార్యశాల ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అధ్యక్షత వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ బండారు రాధిక, బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జ్ గంగాడి మోహన్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏకాత్మ మానవవాదం మరియు అంత్యోదయ సిద్ధాంతాలను ప్రేరణగా తీసుకుని ప్రతి కార్యకర్తలో జాతీయ భావన, సిద్ధాంత నిబద్ధత, సేవాభావాన్ని మరింత బలోపేతం చేయడం ఈ కార్యశాల ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి శిక్షణా కార్యక్రమాలు కీలకమని వారు తెలిపారు.
ఈ కార్యశాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, అల్లాడి రమేష్, రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్, కరీంనగర్ పార్లమెంట్ కో-కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు బర్కం లక్ష్మి, నవీన్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అదనంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పదాధికారులు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కార్యశాలను విజయవంతం చేశారు.
