- స్తంభంపల్లి సర్పంచ్‌గా అశోక్ గౌడ్ విజయం
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలంలోని స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన అభ్యర్థి బొంగాని అశోక్ గౌడ్ విజయం సాధించి, జిల్లాలో పార్టీకి బోణీ అందించారు. స్తంభంపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. బీజేపీకి చెందిన బొంగాని అశోక్ గౌడ్ తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని నమ్ముకుని, అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, నిరుపేదలకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించడం అశోక్ గౌడ్‌కు ఈ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన అశోక్ గౌడ్, తనకు ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
