– 1 కోటి రూపాయలతో తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధి
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని 01,07,08,09,23,28, వార్డుల్లో గడప గడపకూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం 07,08,23 వార్డుల్లో పార్టీ కార్యాలయాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వవిప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వేములవాడ లో మీ బిడ్డగా నేను ఎమ్మెల్యే గా ఉన్నాను. పట్టణంలో, రాజన్న ఆలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అభివృద్ది కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, గతంలో వారికి అవకాశం ఇస్తే వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించరని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలన్నారు..రాజన్న ఆలయాన్ని 4 ఎకరాల విస్తరణలో అభివృద్ధి చేస్తున్నామని,ఒక కన్ను రాజన్న ఆలయం ఇంకో కన్ను పట్టణ అభివృద్ధిగా ముందుకు పోతున్నమని వెయ్యి సంవత్సరాల పాటు ఉండేలా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 50 ఏళ్ల రాజన్న భక్తులు,పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా సాగుతున్నాయని,ప్రజలు కోరుకొనే విధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
తిప్పాపూర్ అభివృద్ధికి ప్రత్యేక కృషి
వేములవాడ పట్టణానికి తిప్పాపూర్ ముక్కు లాంటిదని మనిషి కి ముక్కు ఎంత అందమో వేములవాడ కు తిప్పాపూర్ అలాంటిదని అన్నారు. గతంలో తిప్పాపూర్ బస్ స్టాండ్ తరలిస్తాం అంటే నేను మొదటగా అడ్డుకున్నానని,బీజేపీ వారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇటీవల తిప్పాపూర్ లో 1 కోటి రూపాయలతో నూతన జంక్షన్ అభివృద్ధి చేస్తున్నామని, తిప్పాపూర్ బస్ స్టాండ్ ను త్వరలోనే నూతన శోభ సంతరించుకునెల అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట
గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు,మేము నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం అన్నారు..
గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని,మేము రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు.దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ లో మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. గతంలో పేద ప్రజలు నెలకు 1000 రూపాయల కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి ఉండేదని మేము నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని అన్నారు. పట్టణ ప్రజలు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, మీ వార్డు అభివృద్ధి చేసే బాధ్యత నాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ కి వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు,వేములవాడ ఎమ్మెల్యే గా నేను మీకు అండగా ఉన్న, నాకు చెయ్యి తిరిగే విధానంగా అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
