విద్యార్థులతో కలిసి.. భోజనం చేసి…
కేజీబీవీ విద్యార్థులతో భోజనం చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
బలగం టీవీ, బోయినపల్లి:
బోయినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ను కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, వంట గది, బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో మెనూ పరిశీలించి.. కలెక్టర్ ప్లేట్ తీసుకొని భోజనం తీసుకుని విద్యార్థులతో కలిసి కింద కూర్చొని తిన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని ఆరా తీశారు. ఈ రోజు తింటున్న ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్స్ ఏమి ఉన్నాయో ప్రశ్నించారు? రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలి.. విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని ప్రశ్నించారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం విద్యాలయం పై అంతస్తులో నిర్మిస్తున్న గదులు, టాయిలెట్లు ఇతర పనులపై ఉపాధ్యాయుల నుంచి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు.
పదో తరగతి, ఇతర తరగతుల విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించి అన్ని పాఠాలు చదవాలి.. రాయాలి అని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లక్ష్యం నిర్దేశించూకొని ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. ఉద్యోగం లేదా వృత్తిలో స్థిరపడిన తర్వాత మిగతా విషయాలు ఆలోచించాలని దిశానిర్దేశం చేశారు.



