వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఓటరుకు మరోసారి గుర్తు చేయాలని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బి.ఆర్.ఎస్. పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలను ఓటర్లకు వివరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ క్యాడర్ ను కోరారు.
బుధవారం వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో పార్టీ మండల ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలతో వినోద్ కుమార్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఓటరును కలిసి బీ.ఆర్.ఎస్. పార్టీ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలుపించుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ క్యాడర్ ను కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలను వినోద్ కుమార్ వివరించారు.
ఈ సమావేశంలో వేములవాడ జెడ్పిటిసి రవి, ఎంపీపీ వజ్రవ్వ బాబు, పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, ప్యాక్స్ చైర్మన్ కృష్ణదేవరరావు, సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.